Latest News: News Newsమరింత విలువైన సమాచారం కొరకు ఈ లింక్ క్లిక్ చేసి మన Forum లో Register అవండి. NewsRegister అయిన తరువాత Account ని Actvate చేయటం మరిచి పోకండి, Activate చేయుటకు మీ Mail చూడండి.

Saturday, November 27, 2010

Budget

బడ్జెట్

బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ పదమైన ‘భొగెట్టి’ నుంచి ఏర్పడింది. భొగెట్టి అంటే ‘తోలుసంచి’ అని అర్థం. రానున్న ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయం, చేయనున్న వ్యయాల గురించి తెలిపే లిఖిత పూర్వక నివేదికే బడ్జెట్. భారత రాజ్యాంగం లో బడ్జెట్ అనే పదాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ఆర్టికల్ 112లో ‘వార్షిక ఆర్థిక నివేదిక’ అని ప్రస్తావించారు.

పరిపాలనలో సమర్థత పెంచడానికి, వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించడానికి, కార్య నిర్వాహక శాఖపై శాసన శాఖ నియంత్రణ చేయడా నికి, సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయం సాధిం చడానికి బడ్జెట్ ఒక సాధనంగా ఉపయోగపడుతుంది.

దేశ పాలనను ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాణికి అప్పగించిన రెండేళ్ల తర్వాత 1860, ఏప్రిల్ 7న భారత్‌లో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీన్ని ప్రవేశపెట్టినవారు ‘జేమ్స్ విల్సన్’. స్వతంత్ర భారతానికి మొదటి ఆర్థికమంత్రి షణ్ముగం శెట్టి 1947, నవంబర్ 26న తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమై మార్చి 31తో ముగుస్తుంది. ఫిబ్రవరి నెలాఖరున బడ్జెట్‌ను ఆర్థికమంత్రి పార్లమెంట్‌లో ప్రవేశపెడతా రు. దీనికి ఒకరోజు ముందుగా ‘ఆర్థిక సర్వే’ నివేది కను పార్లమెంటులో ప్రవేశపెడతారు.

ఆర్థిక సర్వేలో గడిచిన సంవత్సరం ఆర్థిక స్థితిగతులను వివరిస్తా రు. ఆర్థిక సర్వేకి ముందుగానే రైల్వేమంత్రి రైల్వే బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతారు. దేశంలో రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్ నుంచి 1921లో వేరు చేశారు. బ్రిటిష్ కాలం నుంచి భారతదేశంలో బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు సభలో సమ ర్పించేవారు. దీన్ని 1999-2000 నుంచి ఉదయం 11 గంటలకు సభలో ప్రవేశపెట్టే నూతన పద్ధతిని యశ్వంత్ సిన్హా ప్రారంభించారు. ప్రస్తుతం ఇదే విధానం కొనసాగుతోంది.

బడ్జెట్-రకాలు
ఆధారిత బడ్జెట్: సాధారణ బడ్జెట్‌లో ప్రతి ఏటా ఒక పథకం లేదా అంశానికి కేటాయింపులు పెంచు తారు. అంటే గడిచిన సంవత్సరం లెక్కల ఆధారం గా ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులు చేస్తారు. దీన్నే ఆధారిత బడ్జెట్ అంటారు. ప్రస్తుతం దేశంలో ఆధా రిత బడ్జెట్‌నే అనుసరిస్తున్నారు.
జీరో బేస్డ్ బడ్జెట్: గతేడాది బడ్జెట్‌ను పూర్తిగా విస్మ రించి, దానిపై ఏ మాత్రం ఆధారపడకుండా వర్త మాన సమస్యలకు ప్రాధాన్యమిస్తూ రూపొందించే బడ్జెట్‌నే ‘జీరో బేస్డ్ బడ్జెట్’ అంటారు. సంప్ర దాయ బద్ధమైన బడ్జెట్‌లో ఏటా కేటాయింపులు పెంచుతూ ఉంటారు. కానీ ఆ పథకం ఆవశ్యకత, ప్రగతిని సరిగా పట్టించుకోరు. జీరో బేస్డ్ బడ్జెట్‌లో మాత్రం ప్రతి ఏటా కేటాయింపులు, అంచనాలు సున్నా నుంచి నూతనంగా రూపొందిస్తారు. జీరో బేస్డ్ బడ్జెట్‌ను మొదటగా అమెరికాకు చెందిన ఫీటర్ ఫైర్ రూపొందించారు.

దీన్ని అమెరికాలో ఒక ప్రైవేట్ కంపెనీలో 1969లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. భారతదేశంలో జీరో బేస్డ్ బడ్జెట్‌ను రాజీవ్‌గాంధీ పాలనా కాలంలో వి.పి. సింగ్ 1986- 87లో ప్రవేశపెట్టారు. 1990-91లో కూడా ప్రయో గాత్మకంగా అమలు చేశారు. మన రాష్ట్రంలో జీరో బేస్డ్ బడ్జెట్‌ను 2000-01లో యనమల రామకృ ష్ణుడు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రంలో ఈ విధానాన్ని కొనసాగించడం లేదు.

పెర్ఫార్మెన్స్ బడ్జెట్: వ్యయాన్ని విధులు, కార్యకలా పాలు, పథకాలు అనే ప్రాతిపదికగా కేటాయింపులు చేయడాన్నే పెర్ఫార్మెన్స్ బడ్జెట్ అంటారు. ఈ బడ్జెట్ ను తొలిసారిగా 1951లో అమెరికా అనుసరించింది. ఈ బడ్జెట్ పనిని పూర్తిచేయడం, దాని వ్యయం పై దృష్టి కేంద్రీకరిస్తుంది.

ఈ బడ్జెట్‌లో ఖర్చు చేసిన మొత్తం,దాని ఫలితం, నిర్ణయించిన కార్యక్రమాలు, దాని ద్వారా సాధించిన ఫలితాలు.. ఇవన్నీ ద్రవ్య రూపంలో స్పష్టంగా ఒక పట్టికలో వివరిస్తారు. పరిపాలనా సంస్కరణల సంఘం (ఏఆర్‌సీ) సిఫా రసుల మేరకు 1968లో కేంద్రంలో కొన్ని మంత్రిత్వ శాఖల్లో పెర్ఫార్మెన్స్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.

తాత్కాలిక బడ్జెట్ (ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్/ ఇంటీ రియం బడ్జెట్): ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ అస్థిరత్వం, యుద్ధం లాంటి ప్రతికూల పరిస్థితుల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను రూపొందించే వీలు లేకపోతే తక్కువ కాలానికి తాత్కాలికంగా రూపొందించే బడ్జెట్‌ను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. సాధారణ ఎన్నికలు దగ్గరలో ఉన్నప్పుడు, ప్రభు త్వం కొనసాగే పరిస్థితి లేనప్పుడు ఈ విధానాన్ని అనుసరిస్తారు. పన్నుల్లో మార్పులు ప్రతిపాదించ కుండా, ప్రస్తుత అమల్లో ఉన్న పన్నులు దృష్టిలో ఉంచుకొని రూపొందించే ఆదాయ, వ్యయాల పట్టి కనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు.

నోట్: సాధారణంగా తాత్కాలిక బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆపద్ధర్మ ప్రభుత్వాలు ప్రవేశ పెడుతుంటాయి. ఈ బడ్జెట్‌లో స్థిర వ్యయాలు మాత్రమే ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఉండవు. పరోక్ష పన్నుల్లో మార్పులు చేయొచ్చు కానీ ప్రత్యక్ష పన్నుల్లో మార్పులు చేయరాదు.

పర్యవసాన బడ్జెట్ (ఔట్-కమ్ బడ్జెట్): కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం 2005, ఆగస్ట్ 25న పార్లమెంటు లో ఔట్-కమ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధాని మన్మోహన్‌సింగ్, ఆర్థికమంత్రి చిదంబరం, ప్రణా ళికా సంఘం చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలి యాలు దీన్ని రూపొందించారు.

బడ్జెట్ కేటాయిం పులు ప్రగతి ఫలాలుగా మారుతున్న క్రమాన్ని, ఆశి స్తున్న లక్ష్యసాధనలను ప్రజల ముందుంచేదే ఔట్- కమ్ బడ్జెట్. ఇది ప్రభుత్వ అంతర్గత సమీక్షకు, జవాబుదారీతనానికి నిదర్శనంగా ఉంటుంది. బడ్జెట్ కేటాయింపులను ఖర్చు పెట్టిందీ, లేనిదీ లెక్కించే సాధారణ గణాంకాల కంటే ఆశించిన లక్ష్యసాధనకు కేటాయింపు వ్యయాన్ని అన్వయించి పరిశీలించటం ఈ బడ్జెట్‌లోని ప్రత్యేకత.

ఆర్థిక బిల్లు: డిమాండ్ ఫర్ గ్రాంట్స్‌ను ఆర్థిక బిల్లు అంటారు. వార్షిక విత్త పత్రంలో పేర్కొన్న వివిధ ఖర్చులు తెలియజేస్తూ రూపొందించిన ప్రతినే ఆర్థిక బిల్లు అంటారు. ఈ బిల్లు సభ్యులు ఆమోదిస్తే బడ్జెట్ ఆమోదం పొందినట్లుగా భావిస్తారు.

బడ్జెట్‌లో అంశాలు:
1) మొత్తం రాబడి (Receipts or Revenue)
2) మొత్త వ్యయం (Expenditure)
సంతులిత బడ్జెట్ (బ్యాలెన్స్‌డ్ బడ్జెట్) =
మొత్తం రాబడి = మొత్తం వ్యయం (R = E)
మొత్తం రాబడి, మొత్తం వ్యయానికి సమానంగా ఉంటుంది. అప్పుడు ఆర్థిక వ్యవస్థ సమతౌల్య స్థితిలో ఉంటుంది. మిగులు బడ్జెట్ (సర్‌ప్లస్ బడ్జెట్) = మొత్తం రాబడి (R) > మొత్తం వ్యయం (E) [R > E]
మొత్తం రాబడి, మొత్తం వ్యయం కంటే ఎక్కు వగా ఉంటుంది. మిగులు బడ్జెట్ ఆర్థిక వ్యవస్థ స్తబ్ధతకు దారితీస్తుంది. ద్రవ్యోల్బణ కాలంలో మిగులు బడ్జెట్ విధానం అనుసరించాలి.

లోటు బడ్జెట్ (డెఫిషిట్ బడ్జెట్) = మొత్తం రాబడి (R) < మొత్తం వ్యయం (E) [R మొత్తం రాబడి, మొత్తం వ్యయం కంటే తక్కు వగా ఉంటుంది. లోటు బడ్జెట్ విధానం ఆర్థిక వ్యవస్థను ద్రవ్యోల్బణం వైపు నెట్టుతుంది.

ఈ బడ్జెట్ వల్ల ధరలు పెరుగుతాయి. కాని స్తబ్ధతగా ఉన్న ఆర్థిక వ్యవస్థలు లోటు బడ్జెట్ విధానం పాటించడం వల్ల చలనత్వం కలిగి ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. ఇటీవల కాలంలో అనేక ప్రభు త్వాలు లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరించడం పరిపాటిగా మారింది.

వ్యయానికి, రాబడికి మధ్య ఉన్న అంతరాన్ని లోటు సూచిస్తుంది. లోటును అనేక రకాలుగా వివరించవచ్చు.బడ్జెట్‌లోని మొత్తం వ్యయం, మొత్తం రాబడి కంటే ఎక్కువగా ఉంటే అది ‘బడ్జెట్ లోటు’ అంటారు. ఈ మేరకు ప్రభు త్వం కరెన్సీని ముద్రించి అభివృద్ధి కార్యక్రమాలపై వ్యయం చేయడం ఒక పద్ధతి. ఈ విధానం ద్రవ్యో ల్బణానికి దారితీసి ఆర్థిక అస్థిరతను కల్పించే ప్రమాదం ఉంది.

గ్రూప్-1 మెయిన్స్ మాదిరి ప్రశ్నలు

1.ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏమిటి? విశ్లేషించండి?

2.బడ్జెట్ ప్రభావం అంటే ఏమిటి? ఒక దేశంపై బడ్జెట్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది?

3.లోటు బడ్జెట్ విధానం అంటే ఏమిటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు తెల్పండి?

4.లోటు బడ్జెట్ విధానం ఏ కాలంలో అనుసరిం చడం ఆర్థిక వ్యవస్థకు శ్రేయస్కరంగా ఉంటుంది?
5.భారతదేశం అనుసరిస్తున్న బడ్జెట్ విధానం గురించి రాయండి?

6.దవ్యోల్బణ కాలంలో ఏ బడ్జెట్ విధానం అను సరించడం దేశానికి మంచిదో విశ్లేషించండి?

7.అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన బడ్జెట్ విధానాన్ని సూచించండి?

8.సమతౌల్య బడ్జెట్ విధానం అన్ని పరిస్థితుల్లో దేశానికి శ్రేయస్కరంగా ఉంటుందా? విశ్లేషించండి?

9.మిగులు బడ్జెట్ విధానం అంటే ఏమిటి? దీనివల్ల ఏర్పడే లాభనష్టాలు రాయండి?


గ్రూప్-2 మాదిరి ప్రశ్నలు

1.కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి వసూళ్లలో ఎక్కువ మూలధనాన్ని సమకూర్చేవి?
(గ్రూప్-2, 2008)
ఎ) చిన్న పొదుపులు
బి) మార్కెట్‌రుణాలు
సి) బహిర్గత ఆదాలు
డి) ప్రాఫిట్ ఫండ్

2. ఏ బడ్జెట్‌లో రాబడి, వ్యయం సమానం?
(గ్రూప్-2, 2008)
ఎ) సమతౌల్య బి) మిగులు
సి) లోటు డి) ఏదీ కాదు
3. బడ్జెట్ వీటిలో దేన్ని కలిగి ఉంటుంది?
1) మిగులు లేదా లోటు వివరాల పట్టిక
2) ఆదాయ, వ్యయాల అంచనా పత్రం
3) నిర్దుష్ట కాలపరిమితిని కలిగి ఉంటుంది
4) ఆచరణాత్మకమైంది
ఎ) 1,2,3,4 బి) 1,2,3 సి) 2,3 డి) 1,4

4. కింది వాటిలో బడ్జెట్‌లో ఉండే అంశాలు?
ఎ) గత ఏడాది ఆర్థిక వివరాలు
బి) ప్రస్తుత సంవత్సర అంచనాలు
సి) రాబోయే సంవత్సర అంచనాలు
డి) పైవన్నీ

5. {బిటిష్ ఇండియాలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టినవారు?
ఎ) ఆర్.కె. షణ్ముగం శెట్టి
బి) జాన్ ముత్తయ్
సి) జేమ్స్ విల్సన్ డి) లార్డ్ కానింగ్

6. పార్లమెంటులో ప్రవేశపెట్టే వీటిని వరుసక్రమంలో అమర్చండి?
1) వార్షిక ఆర్థిక నివేదిక
2) ఆర్థిక సర్వే రిపోర్టు 3) రైల్వే బడ్జెట్
ఎ) 1,2,3 బి) 2,3,1
సి) 3,1,2 డి) 3,2,1

7. బడ్జెట్‌లోని అంశాలు?
ఎ) రెవెన్యూ బి) మూలధన
సి) ఎ, బి డి) ఏదీ కాదు

8. దేశంలో అధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు?
ఎ) కె. రోశయ్య బి) చిదంబరం
సి) మొరార్జీ దేశాయ్ డి) నెహ్రూ

9. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్ నుంచి వేరుచేసిన సంవత్సరం?
ఎ) 1920 బి) 1921 సి) 1923 డి) 1928

10. సాధారణంగా అభివృద్ధి వ్యయాలను పరిగణనలోకి తీసుకోని బడ్జెట్?
ఎ) రైల్వే బి) సాధారణ
సి) ఓట్ ఆన్ అకౌంట్ డి) ఔట్-కమ్

11. {దవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పుడు ఏ బడ్జెట్ అనుసరించడం శ్రేయస్కరం?
ఎ) మిగులు బి) సంతులిత
సి) లోటు డి) ఏదీ కాదు

12. స్వతంత్ర భారతదేశానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థికమంత్రి?
ఎ) సి.డి.దేశ్‌ముఖ్
బి) జవహర్‌లాల్ నెహ్రూ
సి) సుభాష్‌చంద్రబోస్
డి) ఆర్.కె.షణ్ముగం శెట్టి

13. ఆర్థిక వ్యవస్థ స్తబ్ధతకు దారితీసే బడ్జెట్?
ఎ) మిగులు బి) లోటు
సి) సంతులిత డి) ఏదీ కాదు

14. లోటు బడ్జెట్ విధానం ఏ కాలంలో మంచిది?
ఎ) ద్రవ్యోల్బణ బి) ఆర్థిక మాంద్యం
సి) అతి ద్రవ్యోల్బణ
డి) పైవన్నీ

15. జీరో బేస్డ్ బడ్జెట్ కింది వాటిలో దేనికి ప్రాధాన్యమిస్తుంది?
1) గత సంవత్సర వ్యయాన్ని గురించి పట్టిం చుకోకుండా బడ్జెట్ రూపొందించడం
2) {పతి సంవత్సరం జీరో స్థాయి నుంచి బడ్జెట్ రూపొందించడం
3) లోటు ద్వారా బడ్జెట్ రూపొందించడం
4) మిగులు నిధుల ద్వారా బడ్జెట్ రూపొం దించడం
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 4
సి) 1, 2 డి) 1, 2, 3

16. భారతదేశంలో మొదటిసారిగా బడ్జెట్‌ను ఏ వైస్రాయ్ కాలంలో ప్రవేశపెట్టారు?
ఎ) లార్డ్ కానింగ్ బి) లార్డ్ రిప్పన్
సి) లార్డ్ డల్హౌసీ డి) లార్డ్ ఎల్గిన్

17. రాష్ట్రంలో జీరో బేస్డ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంవత్సరం?
ఎ) 1999-2000 బి) 2000-01
సి) 2001-02 డి) 2005-06

18. ‘వార్షిక ఆర్థిక నివేదిక’ అని ఏ ఆర్టికల్‌లో వివరించిఉంది?
ఎ) 110 బి) 111 సి) 112 డి) 116

19. భారతదేశంలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు?
ఎ) 1860, ఏప్రిల్ 7
బి) 1858, సెప్టెంబర్ 8
సి) 1947, ఆగస్ట్ 15
డి) 1857, మే 9

20. ఏ ప్రధానమంత్రి కాలంలో జీరో బేస్డ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు?
ఎ) ఇందిరా గాంధీ
బి) జవహర్‌లాల్ నెహ్రూ
సి) రాజీవ్ గాంధీ డి) మొరార్జీ దేశాయ్
21. పూర్తి స్థాయిలో బడ్జెట్‌ను రూపొందించే వీలు లేనప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్?
ఎ) ఇంటీరియం బి) ఔట్-కమ్
సి) జీరో బేస్డ్ డి) పెర్ఫార్మెన్స్

22. భారత్‌లో పెర్ఫార్మెన్స్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని సూచించినవారు?
ఎ) అంచనాల కమిటీ
బి) సర్కారియా కమిషన్
సి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
డి) పాలనా సంస్కరణల కమిషన్

23. దేశం ఆదాయం, ఆ దేశం ఖర్చు కంటే తక్కువగా ఉంటే?
ఎ) మిగులు బడ్జెట్ బి) బ్యాలెన్స్‌డ్ బడ్జెట్
సి) లోటు బడ్జెట్ డి) మిశ్రమ బడ్జెట్

24. పభుత్వ అంతర్గత సమీక్షకు, జవాబుదారీ తనానికి నిదర్శనంగా ఉండే బడ్జెట్?
ఎ) ఓట్ ఆన్ అకౌంట్
బి) జీరో బేస్డ్ బడ్జెట్
సి) ఔట్-కమ్ డి) బ్యాలన్స్‌డ్


సమాధానాలు
1. బి 2. ఎ 3. సి 4. డి 5. సి
6. డి 7. సి 8. సి 9. బి 10. సి
11. ఎ 12. డి 13. ఎ 14. బి 15. సి
16. ఎ 17. బి 18. సి 19. ఎ 20. సి
21. ఎ 22. డి 23. సి 24. సి

0 comments:

Post a Comment

Search This Blog

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Bluehost Coupons