Latest News: News Newsమరింత విలువైన సమాచారం కొరకు ఈ లింక్ క్లిక్ చేసి మన Forum లో Register అవండి. NewsRegister అయిన తరువాత Account ని Actvate చేయటం మరిచి పోకండి, Activate చేయుటకు మీ Mail చూడండి.

Monday, March 7, 2011

I CET-2011

ఎంబీఏ... ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి   ఐ సెట్ -2011

రెండేళ్ళ ఎంబీఏ, మూడేళ్ళ ఎంసీఏ(ఫుల్ టైం , పార్ట్ టైం , ఎవెనింగ్, డిస్టెన్స్) కోర్సుల్లో ప్రవేశానికి  నిర్వహించే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐ సెట్)-2011 ప్రకటన వెలువడింది. ఈ పరీక్షతో  రాష్ట్రంలో దాదాపు 61 వేల  ఎంబీఏ సీట్లు, 47 వేలకు పైగా సీట్లను భర్తీ చేస్తారు. పరీక్ష విధానం స్పెషల్..


ఫ్రవేశం: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల క్యాంపస్ కళాశాలలతో పాటు వాటి అనుబంధ కళాశాలల్లో ప్రవేశం లభిస్తుంది.
 అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు (ఎస్సీ ,ఎస్టీలు 45 శాతం). ఫైనలియర్ డిగ్రీ విద్యార్దులూ అర్హులే. బీ ఎఫ్ ఏ ,బీ ఓ ఎల్ కోర్సులు చదివిన వారు అర్హులు  కాదు. ఏంసిఏ  కోర్సులూ చేరాలనుకుంటె ఇంటర్మీడియెట్లొ లేదా డిగ్రీలో మాథ్స్ ఒక  సబ్జెక్ట్ గా చదివుండాలి.

ఐ సెట్ -2011 అర్హత మార్కులు :  జనరల్ కెటగిరీ విద్యార్దులు 25 శాతం అంటే 50 మార్కులు పొందాలి. ఎస్సీ ,ఎస్టీ అభ్యర్ధులకు కనీస మార్కులు పొందల్సిన అవసరం లేదు.

ప్రిపరేషన్ ఇలా...

సెక్షన్ ఏ: ఎనలిటికల్ ఎబిలిటి: ఇందులొ రాణించాలంటే అర్థమెటిక్ అంశాల్లో పట్టు సాధించడం చాలా అవసరం. స్టేట్ మెంట్ బెస్డ్ ప్రశ్నలు ఎదురయ్యే ఈ విభాగంలొ ఇచ్చిన స్టేట్ మెంట్స్ లో సరైనదేదో గుర్తించాల్సి ఉంటుంది. దీనికోసం సునిశిత పరిశీలన, గణితం పై ప్రాధమిక అవగాహన అవసరం.
ఉదాహరణకు కింద ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా విలువ కనుక్కోండి ?

1)    x+y=5 2) xy=5 దేన్ని చూడగానే ఆప్షన్ల సాయం తో x, y విలువ కనుక్కోవచ్చు అనే విషయం విద్యార్ధికి తేలియాలి. ఇది పరిఙ్ఞానం, ప్రాక్టీస్  ద్వారానే సాధ్యం.   
ఇక ఈ విభాగం లోనే ఎదురయ్యే రీజనింగ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే.. సిరీస్, కోదింగ్, ఆడ్ మన్ అవుట్ సంబంధ అంశాలపై పట్టు సాధించాలి. ఈ విభాగం లో విషయ పరిఙ్ఞానం కంటే కామన్ సెన్స్ దే కీలక పాత్ర.



 సెక్షన్ బీ: మ్యాథమెటికల్ ఎబిలిటీ

ఈ విభాగంలో ముందుండాలంటే.. ఆరు నుంచి పదో తరగతి  వరకు లెక్కల పుస్తకాలు సమగ్రంగా చదవాలి. ప్రాధమికాంశాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ప్రొబబిలిటి ,ఇనీక్వాలిటీస్ కోసం ఇంటర్మిడియెట్ పుస్తకాలు చదవాలి. అర్థమెటిక్ విభాగం లొ పర్చంటేజీ, లాభనష్టాలు, జామెట్రీ, మెన్సురేషన్, సింపుల్ ఈక్వేషన్స్ పై పట్టు సాధిస్తే మేలు చేస్తుంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ప్యూర్ మాథ్స్ విభాగంలో ప్రోబబిలిటీ,స్టాటిస్టిక్స్ నుంచి సుమారు పది ప్రశ్నలు చొప్పున అడుగుతున్నారు. ఇందులో పట్టు సాధించలంటె గ్రాఫ్స్ , సూత్రాలు గుర్తుంచుకోవాలి.         

సెక్షన్ సీ: కమ్యూనికేషన్ ఎబిలిటీ:
కమ్యూనికేషన్ ఎబిలిటీని సమర్ధంగా ఎదుర్కోవాలంటే.. ఇంగ్లిష్ గ్రామర్ పై పట్టు, వేగంగా చదవగలిగే సామర్ధ్యం అవసరం. కొశ్చన్ ట్యాగ్స్ కు సంబంధించి కనీసం ఐదు నుండి ఏడు అర్దాలు, సినానింస్ నుంచి ఐదేసి ప్రశ్నలు వస్తాయి. ఇందులో మంచి మార్కులు సాధించాలంటే ఆరోతరగతి నుంచి గ్రామర్ బుక్స్ చదవాలి.ముఖ్యంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బాగా తెలిసుండాలి. రీడింగ్ కాంప్రహెన్షన్లో రెండొందల పదాల ప్యాసేజ్ ఇచ్చి దాన్నుంచి ప్రశ్నలు అడుగుతారు. దీనికోసం ప్రత్యేకంగా ప్రామాణిక పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఇంగ్లిష్ స్టొరీ బుక్స్ చదివితె సరిపోతుంది. హిందూ వంటి ఆంగ్ల దినపత్రిక ఇష్టంగా చదవడం అలవరచుకోవాలి. ఫలితంగా ఒక అంశాన్ని సులువుగా, వేగంగా అర్ధం చేసుకునే సామర్ధ్యం పెరుగుతుంది. కంప్యుటర్,బిజినెస్ టెర్మినాలజీల్లొ ప్రాధమికాంశాలపైనే ప్రశ్నలొస్తాయి. రోజూ పేపర్ చదివే అలవాటుంటే బిజినెస్ టెర్మినాలజీ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం సులువే.   

మోర్ ప్రాక్టీస్..మేడ్ ఈజీ..
 ఐ సెట్ లో మంచి ర్యాంకు సాధించడానికి ఏకైక మార్గం నిరంతర ప్రాక్టీస్. డిగ్రీ విద్యార్ధులు చివరి ఏడాది పరీక్షల ప్రిపరేషన్లొ ఉంటారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి అందుబాటులో ఉన్న ఈ 40/45 రోజులు ఐసెట్ కోసం బాగా చదవాలి. రోజుకు కనీసం పది గంటల ప్రిపరేషన్ ఉండాలి. ముఖ్యంగా లెక్కల్ని కాన్సెప్ట్ బెస్డ్గా అవగాహన చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడె ప్రశ్న ఎలా ఇచ్చినా సమాధానం రాబట్టడం సులువవుతుంది. ర్యాంకును ప్రభావితం చేసే విషయంలో లెక్కలది నిర్ణయాత్మక పాత్ర. కాబట్టి ఆ విభాగానికి ఎక్కువ సమయం కేటాయించాలి. ముఖ్యంగా ఆర్ట్స్ విద్యార్ధులు కష్టమైనవి వదిలిపెట్టడం కాకుండా ప్రతి అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి.


టైం మేనేజ్మెంట్...
ఐ సెట్ విద్యార్ధులు గుర్తుంచుకోవాల్సిన మరో ప్రధాన అంశం.. టైం మేనేజ్మెంట్. పరీక్షలో ఉండే మార్కుల వెయిటేజీని బట్టి సంబంధిత సబ్జెక్ట్ కు తగిన సమయం కేటాయించాలి. సెక్షన్ ఏ, సెక్షన్ బీ లకు 75 మార్కుల చొప్పున నిర్ణయించారు. వీటికోసం రోజుకు కనీసం మూడు గంటల చొప్పున, 50 మార్కులకు ఉండే సెక్షన్ సీకి రోజుకు రెండు గంటలు కేటాయించాలి. ప్రిపరేషన్ తో పాటు ప్రతిరోజూ మోడల్ ప్రశ్నపత్రాలను సాల్వ్ చెయ్యాలి. కేటాయించిన సమయం కంటే పది.. పదిహేను నిమిషాల ముందే ప్రతీ సెక్షన్ ను పూర్తి చేసేలా సాధన చేయాలి. ఉదాహరణకు 75 మార్కులున్న సెక్షన్ ఏ ను..60 నిమిషాల్లోనే పూర్తిచేయాలి. ఇందులో డేటా సఫిషియన్సీ 12 నుంచి 15 నిమిషాలు, రీజనింగ్ 35 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఇదే ఫార్ములాను మిగతా సెక్షన్లకూ వర్తింపజేయాలి.దీనివల్ల స్పీడ్ పెరగడంతో పాటు పరీక్ష హాల్లో పాటించాల్సిన టైం మేనేజ్మేంట్ కు సంబంధించి పూర్తి అవగాహన వస్తుంది. ఇక పరీక్ష హాల్లో ముందుగా తెలికైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి, చివర్లో కష్టమైన వాటి సంగతి చూడాలి. ప్రతి సెక్షన్ ను నిర్ణీత సమయంలో పూర్తిచేయాలి. ఆఖారు పది నిమిషాలు మిగిలిపోయిన ప్రశ్నలకు మీకు తోచిన సమాధానాలు గుర్తించండి.      




0 comments:

Post a Comment

Search This Blog

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Bluehost Coupons